- పార్టీ జిల్లా అధ్యక్షుడు గోపి
వేములవాడ, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. శుక్రవారం వేములవాడలో పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్అధ్యక్షతన మున్సిపల్ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ రాజన్న క్షేత్రంలో బీజేపీ అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు గెలుపుకోసం పనిచేయాలన్నారు.
రాష్ట్ర నాయకుడు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా పనిచేస్తే తప్పకుండా విజయం సాధిస్తామన్నారు. కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి వికాస్ రావు, లీడర్లు ఎర్రం మహేశ్, సిరికొండ శ్రీనివాస్, కృష్ణస్వామి, రాజ్ కుమార్, రాధిక పాల్గొన్నారు.
