శనివారం ( జనవరి 3 ) అసెంబ్లీలో ఇందిరమ్మ ఇళ్ల అంశంపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేసిందని.. తమ ప్రభుత్వంలో భేషజాలకు వెళ్లకుండా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది లబ్దిదారులను గుర్తించామని.. ఆగిపోయిన ఇళ్లకు నిధులిచ్చి పూర్తీ చేస్తున్నామని అన్నారు మంత్రి పొంగులేటి.
గత పాలకులు పదేళ్లు కమిషన్ల కోసమే పనిచేశారని.. పదేళ్లలో ఇళ్ళు పూర్తీ చేసి ఉంటే పేదలకు ఇబ్బంది ఉండేది కాదని అన్నారు పొంగులేటి.పదేళ్లు కమిషన్లు తీసుకొని అరకొర ఇళ్ళు ఇచ్చారని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక చెంచులందరికీ మొదటి విడతలోనే ఇళ్ళు మంజూరు చేశామని అన్నారు పొంగులేటి.
►ALSO READ | కొండగట్టు అంజన్న అంటే నాకు సెంటిమెంట్, స్వామి ఆశీస్సులతోనే ప్రమాదం నుంచి బయటపడ్డా: పవన్ కళ్యాణ్
గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా ఇందిరమ్మ ఇండ్లే కనిపిస్తున్నాయని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు గుర్తిస్తున్నామని అన్నారు.పేదల ఆత్మగౌరవానికి సంబంధించిన ఇండ్ల నిర్మాణంలో రాజీపడం అని.. అర్హులందరికీ తప్పకుండా ఇండ్లు ఇస్తామని అన్నారు పొంగులేటి.
