
ప్రధాని మోడీ కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని పాల్గొననున్నారు. అయితే మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. అయినప్పటికీ మోడీ సభలో ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ కోసం ఒక చైర్ రిజర్వ్ చేశారు. ప్రధాని మోడీ చైర్ కు ఎడమవైపున కేసీఆర్ కు సీటు కేటాయించారు. ఇదే వేదికపై టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డికి కూడా చోటు కల్పించారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు సీట్లు ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కారని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ కేసీఆర్ కోసం ఓ సీటును రిజర్వ్ చేసి పెట్టారు. మోడీ సభకు హాజరు అయ్యే ఐదు నిమిషాల లోపు చైర్ లో కూర్చోని ఉండాలి. అలా కాకుండా ఖాళీగా ఉంటే ఈ చైర్ ను తీసిసే సంప్రదాయం ఉంది. సీటు ఎటూ కేటాయించారు కాబట్టి.. చివరి నిమిషంలో కేసీఆర్ మనసు మార్చుకుని రావొచ్చు కదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.