పార్టీ నేతల్లో విభేదాలపై బీజేపీ ద్విసభ్య కమిటీ.. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు నిర్ణయం

పార్టీ నేతల్లో విభేదాలపై బీజేపీ ద్విసభ్య కమిటీ.. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్రావు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: వికారాబాద్​, రంగారెడ్డి జిల్లాల్లో నేతల మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు.. ద్విసభ్య కమిటీని నియమించారు. కమిటీలో సీనియర్ నేతలు ఎం. ధర్మారావు, మధుసూధన్ రెడ్డి తదితరులున్నారు.

 ఇరు వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకొని, సమస్య పరిష్కారానికి ఈ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడికి నివేదిక అందించనున్నది. ఈ రెండు జిల్లాల్లో కొంతకాలంగా నేతల మధ్య గొడవలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పలుమార్లు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.