వనపర్తి, వెలుగు : ఆర్ఎస్ఎస్, బీజేపీలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాజ్యమేలుతున్నాయని సీపీఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు విమర్శించారు. ఆదివారం పార్టీ జిల్లా ఆఫీస్లో కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇన్నేండ్లుగా దేశం సాధించుకున్న సంపదను కార్పొరేట్ బడా వ్యాపారులకు బీజేపీ దోచిపెడుతోందని ఆరోపించారు. స్థానిక ప్రజా సమస్యలపై జూన్ నుంచి ఆగస్టు వరకు క్యాంపియన్ నిర్వహిస్తామని తెలిపారు.
