సిటీలో పడిపోయిన బీజేపీ గ్రాఫ్

సిటీలో పడిపోయిన బీజేపీ గ్రాఫ్
  • గోషామహల్​లోనే రాజాసింగ్ గెలుపు 
  •     అన్ని చోట్ల ఓటమి చెందిన పార్టీ అభ్యర్థులు
  •     ఈసారి పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ 

హైదరాబాద్, వెలుగు:  సిటీలో బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. పక్కాగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన స్థానాల్లోనూ చతికిలపడిపోయింది. 2018లో  గోషామహల్​లో రాజాసింగ్ మాత్రమే గెలుపొందారు. బల్దియా ఎన్నికల్లో సత్తాచాటిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకెళ్లలేకపోయింది. గతంతో పోలిస్తే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పటికీ సీట్లను మాత్రం సాధించలేకపోయింది.

అంబర్ పేటలో గతంతో పోలిస్తే చాలా వరకు ఓట్లు తగ్గాయి. 2018లో 2 వేలలోపు మెజార్టీతో బీజేపీపై బీఆర్ఎస్ ​గెలుపొందగా ఈసారి 24 వేల మెజార్టీతో బీజేపీపై బీఆర్ఎస్​ గెలుపొందింది.  మహేశ్వరం, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, ముషీరాబాద్, చార్మినార్,  కార్వాన్, ఎల్​బీనగర్, సనత్​నగర్, కంటోన్మెంట్ స్థానాల్లో  రెండో స్థానంలో నిలిచింది. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్ ప్రాంతాల్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. సిటీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ ఆశలు నిరాశలు అయ్యాయి.