Delhi Liquor Scam : కవితకు ఈడీ నోటీసులపై బీజేపీ రియాక్షన్

Delhi Liquor Scam : కవితకు ఈడీ నోటీసులపై బీజేపీ రియాక్షన్

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ (MLC Kavutha)కూతురు, ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చిన దగ్గర నుంచి బీజేపీ(BJP) ఓ ఆట ఆడుకుంటోంది. పొలిటికల్ గేమ్ లో విమర్శలు, ఆరోపణలు చేస్తూ.. కేసీఆర్ (KCR)సర్కార్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వీలు దొరికినప్పుడల్లా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో ఊపిరి సలపనీవ్వడం లేదు. రేపో, మాపో ముఖ్యమంత్రి కూతురు అరెస్ట్ అవ్వడం తప్పదని హెచ్చరిస్తూ వస్తోంది. అది కూడా కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ నేత‌లు ప‌దేప‌దే చెప్పడం మరిన్ని అనుమానాల‌కు తావిస్తోంది.

హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై(Arun Ramachandra Pillai)ను అరెస్ట్ చేయడంతో లిక్కర్ స్కామ్ కేసు మరింత హాట్ టాపిక్ గా మారింది. తదుపరి అరెస్ట్ కల్వకుంట్ల కవితేనని బీజీపీ వర్గాలు చెబుతున్నాయి. అందరూ అనుకుంటున్నట్లుగానే మార్చి 8వ తేదీన కవితకు ఈడీ నోటీసులు పంపింది. ఢిల్లీలో విచారణకు హాజరుకావలని కబురు పంపింది. 

ఈ కేసులో ఇప్పటి వరకూ ఆరోపనలు ఎదుర్కొంటున్న వారందరూ ఒకరి తర్వాత మరొకరు అరెస్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే కవిత కూడా అరెస్ట్ అవుతారని బీజేపీ ప్రచారం చేస్తోంది. మరి నిజంగానే విచారణకు పిలిచిన ఈడీ.. కవితను అరెస్ట్ చేస్తుందా..? లేదా..? ఒకవేళ అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో రాజకీయలు ఎలా ఉండనున్నాయి. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎలక్షన్స్ (Assembly Elections) ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇంత పెద్ద పరిణామం చోటు చేసుకోవడం పొలిటికల్ సర్కిల్ లో ఒక కుదుపు అని చెప్పొచ్చు. అయితే.. కవిత అరెస్ట్ అంశంపై బీఆర్ఎస్ కు కలిసి వస్తుందా..? లేదంటే బ్యాడ్ అయ్యే అవకాశం ఉందా..? అనేది పక్కన పెడితే.. బీజేపీకి కూడా ఏ మేరకు లబ్ధి చేకూరుతుందనేది ఇప్పుడే చెప్పలేం. 

ఈ అంశంపై ఏ పార్టీకి మైలేజీ తీసుకువస్తుంది..? ఏ పార్టీకి మైనస్ అవుతుందానేది అప్పుడున్న పరిస్థితి ప్రకారం అంచనా వేయవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే గనుక కేసీఆర్ ఉగ్రరూపం చూడాల్సి వస్తుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. 

ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia) అరెస్ట్ పై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందిస్తూ విమర్శలు చేస్తోంది. ఇదంతా బీజేపీ కుట్రగా చెబుతోంది. ఇదిలా ఉంటే అసలు ఈ కేసులో కవిత అరెస్ట్ అయితే చోటుచేసుకునే పరిణామాలపైనా బీజేపీ లెక్కలు వేసుకుంటోంది.  ఏది ఏమైనా ప్రస్తుత పాదయాత్రల కాలంలో కవిత అరెస్ట్ అయితే.. ఏ రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందోననే చర్చలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి.