బీజేపీలో సంస్థాగత మార్పులు.. అన్ని రాష్ట్రాల పార్టీ చీఫ్​లు చేంజ్​

బీజేపీలో సంస్థాగత మార్పులు..  అన్ని రాష్ట్రాల పార్టీ చీఫ్​లు చేంజ్​

హైదరాబాద్: బీజేపీలో సంస్థాగత మార్పులు త్వరలో ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా కొనసాగించారన్నారు. ఇప్పుడు ఆ టెన్యూర్ పూర్తయిందన్నారు. అధ్యక్ష మార్పు అనివార్యమని పేర్కొన్నారు. ఇవాళ కిషన్​రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తనకు మంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించారని కిషన్ రెడ్డి తెలిపారు. 

ఇప్పుడు ఎన్నికలు ముగిసినందున.. తెలంగాణ సహా ఇంకా అనేక రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష మార్పులు ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. పార్టీ సంస్థాగత మార్పులపై త్వరలోనే కసరత్తు చేసి కొత్తవారిని నియమిస్తారని వెల్లడించారు. ఇండియా కూటమిది దివాళాకోరు రాజకీయమని విమర్శించారు. ప్రధాని ప్రమాణస్వీకారానికి ప్రతిపక్షం రాకపోవడం ఇదే మొదటిసారి అన్నారు. చంద్రబాబు నాయుడు, నితీష్‌ కుమార్ ను ఇండియా కూటమి రెచ్చగొడుతుందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.