ఎన్డీయే మీటింగ్‌‌‌‌‌‌‌‌కు రండి

ఎన్డీయే మీటింగ్‌‌‌‌‌‌‌‌కు రండి
  • చిరాగ్‌‌‌‌‌‌‌‌ పాశ్వాన్‌‌‌‌‌‌‌‌కు బీజేపీ ఆహ్వానం

న్యూఢిల్లీ: జులై 18న జరిగే బీజేపీ నేతృత్వంలోని నేషనల్‌‌‌‌‌‌‌‌ డెమోక్రటిక్ అలయన్స్‌‌‌‌‌‌‌‌ సమావేశానికి హాజరుకావాలని లోక్‌‌‌‌‌‌‌‌ జన్‌‌‌‌‌‌‌‌శక్తి పార్టీ (రామ్‌‌‌‌‌‌‌‌ విలాస్‌‌‌‌‌‌‌‌) నేత చిరాగ్‌‌‌‌‌‌‌‌ పాశ్వాన్‌‌‌‌‌‌‌‌ను బీజేపీ అధిష్టానం ఆహ్వానించింది. కేంద్ర మంత్రి నిత్యానంద్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం రాత్రి చిరాగ్‌‌‌‌‌‌‌‌ను కలిశారు. అలాగే, బీజేపీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ జేపీ నడ్డా రాసిన లేఖను నిత్యానంద్‌‌‌‌‌‌‌‌ ఆయనకు అందజేశారు. 

ఎన్డీయే రాజ్యాంగంలో ప్రాంతీయ పార్టీలకు చాలా ప్రాముఖ్యత ఉందని, అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయని జేపీ నడ్డా తన లేఖలో పేర్కొన్నారు. బీజేపీ మిత్రపక్షాలైన శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఏక్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌ షిండే, ఎన్సీపీ రెబల్‌‌‌‌‌‌‌‌ అజిత్‌‌‌‌‌‌‌‌ పవార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూపీల్లోని పలు చిన్న పార్టీలు, ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్డీయే మీటింగ్‌‌‌‌‌‌‌‌ వచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది.