సాగర్ లో బీజేపీ విజయం ఖాయం

సాగర్ లో బీజేపీ విజయం ఖాయం

40 ఏళ్ల చరిత్రని తిరగరాస్తూ నాగార్జున సాగర్ నియోజకవర్గం లో కాషాయ జండా రెపరేప లాడబోతుందని దీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రవికుమార్ నాయక్. నల్గొండ జిల్లా  త్రిపురారం మండలం పలుగు తండాలోని తన సొంత గ్రామంలో కుటుంబంతో సహా క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత మాట్లాడిన ఆయన
జనరల్ స్థానంలో ST అభ్యర్థిని నియమించిన ఘనత ఒక్క బీజేపీ పార్టీకే సాధ్యమన్నారు. బీజేపీ  పార్టీకి తాను ఎంతో రుణపడి ఉంటానని.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ గెలవబోతున్నట్లు స్పష్టం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అవినీతి  పాలనలో విసుగుచెందిన ప్రజలు ఆ రెండు పార్టీలకు ఈ ఉప ఎన్నికల్లో  బుద్ది చెప్పడం ఖాయమన్నారు.