తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు.. బీజేపీతో కటీఫ్

 తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు.. బీజేపీతో కటీఫ్

తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లుగా అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి  జయకుమార్ వెల్లడించారు.  ఇక నుంచి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదని స్పష్టం చేశారు.  తమిళనాడు బీజేపీ చీఫ్  అన్నమలై.. ద్రవిడ నేత అయిన అన్నాదురైపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని దీనిని తమ పార్టీ కార్యకర్తలు సహించలేకపోతున్నారని తెలిపారు.  

ఇక నుంచి అన్నామలై తమ పార్టీ  నేతలను విమర్శిస్తే తీవ్ర పరిణామలను ఎదురుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.  తమిళనాడు బీజేపీ చీఫ్‌గా అన్నామలై అనర్హుడంటూ జయకుమార్ కామెంట్స్ చేశారు.  తమ పార్టీతో పొత్తు వల్లే బీజేపీకి తమిళనాడులో ఆ మాత్రం  గుర్తింపు వచ్చిందని జయకుమార్ వ్యాఖ్యానించారు