ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సిద్ధంగా ఉంది: ఎంపీ లక్ష్మణ్

ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ సిద్ధంగా ఉంది: ఎంపీ లక్ష్మణ్

న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ స్పెషల్ సెషన్ నేపథ్యంలో విపక్షాలకు ముందస్తు ఎన్నికల జ్వరం పట్టు కుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అయితే, కేంద్రానికి ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. శుక్రవారం ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడారు. 

దేశ ప్రజల హితం కోసమే ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర నిర్ణయించిందని చెప్పారు. జమిలీ ఎన్నికలతో ప్రజాధనం వృధా అయ్యే అవకాశం తగ్గుతుందన్నారు. సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి, ప్రధాని జన్మదినం పురస్కరించుకొని ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలో సెప్టెంబర్ 16న, దేశవ్యాప్తంగా 17న ఓబీసీ మోర్చా నేతృత్వంలో జిల్లా, మండల స్థాయిల్లో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నామని వెల్లడించారు.

కేసీఆర్​ఫెయిల్యూర్స్​పై ‘సోషల్​’ వార్

కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా బీజేపీ ‘సోషల్ మీడియా వారియర్స్’ను రంగంలోకి దించా లని బీజేపీ  నిర్ణయించింది. తొమ్మిదేండ్లలో బీసీల కోసం మోదీ సర్కార్‌‌ ప్రవేశ పెట్టిన స్కీమ్​లతో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టే బాధ్యత బీజేపీ ఓబీసీ మోర్చా తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షతన కీలక భేటీ జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర పథకాలతో లబ్ధి పొందిన బీసీలతో చర్చలు ఏర్పాటు చేయాలని నిర్ణయిచింది.