తెలంగాణలో బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది : వివేక్ వెంకటస్వామి

తెలంగాణలో బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది :  వివేక్ వెంకటస్వామి

తెలంగాణలో బీజేపీ చాలా స్ట్రాంగ్  గా ఉందని ఆ పార్టీ జాతీయ  కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి చెప్పారు.  రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే  అన్ని రంగాల్లో అభివృద్ది జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు ప్రభుత్వమే  చెల్లిస్తుందని వెల్లడించారు.  డబల్ ఇంజన్ సర్కార్ వస్తే రాష్ట్రం, దేశం ఎంతో అభివృద్ధి అవుతుందని  చెప్పారు.   ప్రధాని మోదీ ప్రపంచంలోనే  దేశాన్ని నెంబర్ వన్ గా నిలిపారని కొనియాడారుతొమ్మిదేళ్ల లో 58 వేల కిమీ హైవేలు మోడీ ప్రభుత్వం నిర్మించిందని ఈ సందర్భంగా తెలిపారు. సికింద్రాబాద్ టూ నాగపూర్ వయా మంచిర్యాల వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడిపిస్తామని హామీ ఇచ్చారు.