బడ్జెట్ సెషన్.. బీజేపీ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ.. 

బడ్జెట్ సెషన్.. బీజేపీ రాజ్యసభ ఎంపీలకు విప్ జారీ.. 

న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 8వ తేదీతో ముగియనున్నాయి. సమావేశాలకు చివరి వారం కావడంతో అధికారపార్టీ కీలక బిల్లులకు సభ ఆమోదముద్ర వేయించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ తమ పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేసింది. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు సభ్యులంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఆదేశించింది. 

బడ్జెట్ సమావేశాల చివరి వారంలో కేంద్రం 7 బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని భావిస్తోంది. వాటిలో 3 బిల్లులకు లోక్ సభ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎగువ సభలో ఈ బిల్లులపై చర్చకు బీఏసీ 17 గంటల సమయం కేటాయించింది. త్రిపురకు సంబంధించి కానిస్టిట్యూషన్ (షెడ్యూల్ ట్రైబ్) ఆర్డర్ (అమెండ్మెంట్) బిల్ 2022, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (అమెండ్ మెంట్) బిల్లు 2022, ది చార్టర్డ్ అకౌంటెంట్స్, ది కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ అండ్ ది కంపెనీ సెక్రటరీస్ అమెండ్ మెంట్ బిల్లు 2021, యూపీకి సంబంధించి ది కానిస్టిట్యూషన్ (షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్) ఆర్డర్స్ అమెండ్ మెంట్ బిల్లు 2022, ది క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్లు 2022, ది ఇండియన్  అంటార్కిటికా బిల్లు 2022, ప్రొహిబిషన్ ఆఫ్ అన్ లాఫుల్ యాక్టివిటీస్ అమెండ్ మెంట్ బిల్లు 2022 లపై చర్చ అనంతరం సభ ఆమోదంపొందాలని కేంద్రం భావిస్తోంది.

For more news..

గంజాయికి బానిసైన కొడుకు.. కళ్లలో కారం పోసి కొట్టిన తల్లి

25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్