తెలంగాణపై మరో 40ఏళ్ల పాటు అప్పుల ప్రభావం

తెలంగాణపై మరో 40ఏళ్ల పాటు అప్పుల ప్రభావం

కేసీఆర్ ప్రభుత్వం అప్పులతో తెలంగాణను సర్వ నాశనం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ఈ అప్పుల ప్రభావం తెలంగాణపై మరో 40 సంవత్సరాల పాటు ఉంటుందని ఆయన అన్నారు. అప్పులు తెచ్చినా.. జీతాలు, పెన్షన్లు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వముందని ఆయన అన్నారు. బస్సు చార్జీలు అయితే పెంచారు కానీ, పాలనను మాత్రం గాలికి వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టే కేసీఆర్ అసలు రూపం తెలిసిపోతుందని ఆయన అన్నారు. ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే కేసీఆర్ గురించి అర్థమవుతుందని ఆయన అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమకు పరాభవం తప్పదని సీఎం గ్రహించారని లక్ష్మణ్ అన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో, మరో పార్టీతో కలిసి అధికారం పంచుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. మజ్లీస్‌తో అంటకాగుతున్న TRSను ప్రజలు నమ్మడం లేదని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు కూడా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయనుకున్నం కానీ, వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 28 వేలు మాత్రమేనని ఆయన అన్నారు. కేసీఆర్ కుటుంబంలో కొలువులు వస్తున్నాయి కానీ.. చదువుకున్న యువతకు మాత్రం ఉద్యోగాలు రావడంలేదని ఆయన అన్నారు.

తెలంగాణ నూతన సీఎస్‌గా సోమేశ్ కుమార్ నియామకంపై లక్ష్మణ్ స్పందించారు. సోమేశ్ కుమార్‌ను సీఎస్‌గా నియమించడం కరెక్టు కాదని ఆయన అన్నారు. DOPT నిబంధనలకు విరుద్ధంగా సోమేశ్ కుమార్‌ను సీఎస్‌గా నియమించారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ క్యేడర్‌కు చెందిన వ్యక్తిని తెలంగాణ సీఎస్‌గా నియమించారని, ఇదంతా కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసమేనని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.