- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: అక్బరుద్దీన్ ఒవైసీ కు టుంబ ఆస్తులపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిసారి అసెంబ్లీలో అక్బరుద్దీన్ కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని విమర్శించడం సరికాదన్నారు.
సీబీఐ, ఈడీ అంటూ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు ఆస్తులు.. ఇప్పుడు ఉన్న కుటుంబ సభ్యుల ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలని కోరారు. ఈ క్రమంలో స్పీకర్ మైక్ కట్ చేశారు. శ్రీధర్ బాబు జోక్యం చేసుకొని మాట్లాడటంతో పరిస్థితి సద్దుమణిగింది.
