రిచర్డ్ రిషి, రక్షణ ఇందుచూడన్ జంటగా మోహన్ జి దర్శకత్వంలో సోల చక్రవర్తి నిర్మిస్తున్న చిత్రం ‘ద్రౌపది 2’. బుధవారం ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు మేకర్స్.
జిబ్రాన్ కంపోజ్ చేసిన ఈ పాటను చిత్ర దర్శకుడు మోహన్.జి రాయగా, జిబ్రాన్, గోల్డ్ దేవరాజ్, గురు హరిరాజ్ పాడారు. తుగ్లక్ పాత్రలో నటిస్తున్న చిరాగ్ జానీపై ఈ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించారు.
మరోవైపు ఈ పాటలో హీరో రిషి ‘రామా రామా హరే రామా’ అంటూ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్న విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాగా, త్వరలో ట్రైలర్, సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నామని మేకర్స్ తెలియజేశారు.
