గోదావరిఖని, వెలుగు: సింగరేణి కంపెనీ స్థాయి హాకీ ఫైనల్ పోటీలు బుధవారం గోదావరిఖనిలోని జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో జరిగాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ఏరియా జట్టు విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో శ్రీరాంపూర్జట్టు ఒక పాయింట్సాధించి విజేతగా.. గట్టి పోటీ ఇచ్చిన మందమర్రి–బెల్లంపల్లి జట్టు రన్నర్‌గా నిలిచింది. గెలుపొందిన జట్లకు సింగరేణి ఆర్జీ –1 ఏరియా జీఎం డి.లలిత్‌కుమార్, సేవా అధ్యక్షురాలు అనిత ట్రోపీతో పాటు బహుమతులు అందించారు.
రాబోయే కోల్ఇండియా స్థాయి పోటీల్లో ప్రతిభను చాటి సింగరేణికి ట్రోఫీని తీసుకొచ్చేలా శిక్షణ పొందాలని జీఎం సూచించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, ఎస్ఓటు జీఎం కె.చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ ఎం.రవీందర్ రెడ్డి, డిస్ట్రిక్ట్యూత్ స్పోర్ట్స్ఆఫీసర్ ఎ.సురేష్, వర్సిటీ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ ఇ.మనోహర్, ఆఫీసర్ల సంఘం ప్రతినిధి పెరుమాళ్ల శ్రీనివాస్, స్పోర్ట్స్ అసోసియేషన్‌కార్యదర్శి హనుమంతరావు, సీనియర్ పీవో శ్రావణ్ కుమార్, ఆఫీసర్లు ఆనందరావు, ఎం.వీరారెడ్డి, శిరీష, బీనాసింగ్, రజిత, కళ్యాణి, విజయ తదితరులు పాల్గొన్నారు.
