యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య లీడ్ రోల్‌లో రాబోతున్న సినిమా 'సీతా పయనం'. బుధవారం ఈ చిత్రం నుంచి ‘అస్సలు సినిమా’ అనే పాటను విడుదల చేశారు. ‘‘ఆహా ఓహో అంటాడు.. అందం నీదే అంటాడు” అనే పల్లవితో మొదలైన ఈ పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయగా, శ్రేయ ఘోషల్ పాడారు.
‘‘ఆహో ఓహో అంటాడు అందం నీదే అంటాడు.. అరె బుగ్గలు బబ్లీ అంటాడు కన్నులు క్రేజీ అంటాడు.. నడకలు నాటీ అంటాడు.. కానీ అయ్యాక పెళ్లయ్యాక.. అస్సలు సినిమా ముందుంది చూడండి ఇక చూడండి..” అంటూ చంద్రబోస్ రాసిన సాహిత్యం ఆకట్టుకుంది.
పెళ్లి వేడుక నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాటలో ఐశ్వర్య ఎనర్జిటిక్ డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఇంప్రెస్ చేసింది. ఫిబ్రవరి 14న తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
