హెల్త్‌‌‌‌ వివరాల కోసం చాట్‌‌‌‌జీపీటీ బాట

హెల్త్‌‌‌‌ వివరాల కోసం చాట్‌‌‌‌జీపీటీ బాట

న్యూఢిల్లీ: గ్లోబల్‌‌‌‌గా సుమారు 4 కోట్ల మంది యూజర్లు హెల్త్‌‌‌‌, మెడికల్‌‌‌‌కు సంబంధించిన వివరాల కోసం చాట్‌‌‌‌జీపీటీని వాడినట్టు వెల్లడయింది. టెక్ కంపెనీ ఓపెన్‌‌‌‌ ఏఐ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం, హెల్త్ ఇన్సూరెన్స్ అంశంపై కూడా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.

రూరల్ ఏరియాల నుంచి ఇటువంటి ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. ‘‘ప్రతి వారం 20 లక్షలకు పైగా మెసేజ్‌‌‌‌లు  హెల్త్ ఇన్సూరెన్స్‌‌‌‌పై ఉంటున్నాయి. ప్లాన్‌‌‌‌లను పోల్చడం, ధరలు, క్లెయిమ్‌‌‌‌లు, అర్హత, కవరేలపై యూజర్లు ప్రశ్నలు వేస్తున్నారు”అని ఓపెన్‌‌‌‌ ఏఐ పేర్కొంది.