Nari Nari Naduma Murari: ఫ్యామిలీస్‌‌‌‌తో కలిసి నవ్వుకునేలా.. నారి నారి నడుమ మురారి

Nari Nari Naduma Murari: ఫ్యామిలీస్‌‌‌‌తో కలిసి నవ్వుకునేలా.. నారి నారి నడుమ మురారి

ఏజెంట్, గాంఢీవధారి అర్జున చిత్రాలతో ఆకట్టుకున్న సాక్షి వైద్య.. ఈ సంక్రాంతికి ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర విశేషాలను గురించి సాక్షివైద్య మాట్లాడుతూ ‘‘ఏజెంట్’ సినిమా టైమ్‌‌‌‌లోనే నాతో మరో సినిమా చేస్తానని నిర్మాత అనిల్‌‌‌‌ గారు చెప్పారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ చిత్రంలో నిత్య అనే పాత్రకు ఎంపిక చేశారు. తను అమాయకంగా కనిపించే అమ్మాయి. అలాగే నిజాయితీగా ఉంటుంది. 

ఈ సినిమాకి స్టోరీ ఈజ్ కింగ్. ఇందులోని పాత్ర వ్యక్తిగతంగా నాకు చాలా రిలేట్ అవుతుంది. దాదాపు నెల రోజులు పాటు వర్క్ షాప్ చేశాం. డైరెక్టర్ సాయి గారు తగినంత సమయం ఇవ్వడంతో తెలుగు భాష విషయంలో అంతగా ఇబ్బంది పడలేదు.

శర్వా గారి కామెడీ టైమింగ్ అద్భుతం. సంయుక్త గారితో చాలా మంచి కాంబినేషన్స్ సీన్స్ ఉన్నాయి. చాలా విషయాల్లో నాకు హెల్ప్ చేసింది. కేరళ షెడ్యూల్ సహా సినిమా షూటింగ్‌‌‌‌ అంతా ఫన్ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌. అదే ఫన్‌‌‌‌ తెరపైకి వచ్చింది. ఫ్యామిలీతో కలిసి నవ్వుకునేలా ఉంటుంది’  అని  చెప్పింది.