‘టీటీడీ నిధులు పక్కదారి పడుతున్నాయ్’.. హైకోర్టులో పిల్

‘టీటీడీ నిధులు పక్కదారి పడుతున్నాయ్’.. హైకోర్టులో పిల్
  • బాండ్ల కొనుగోలు నిర్ణయాన్ని ప్ర‌భుత్వాలు నిలిపివేయాలి
  • ఏపీ హైకోర్టులో భాను ప్ర‌కాశ్ రెడ్డి పిల్

అమ‌రావ‌తి: టీటీడీ నిధులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్ల కొనుగోలును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ‌బీజేపీ నేత, టీటీడీ మాజీ సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి . అధిక వడ్డీ పేరుతో బాండ్ల కొనుగోలు నిర్ణయం సరికాదన్నారు. టీటీడీ నిధులు పక్కదారి పడుతున్నాయని… బాండ్ల కొనుగోలు నిర్ణయాన్ని నిలిపివేయాలని పిల్​లో పేర్కొన్నారు. ఫైనాన్స్‌ కమిటీ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో నిధులు పెడుతున్నట్లు ఆగస్టు నెలలో టీటీడీ పాలకమండలి తీర్మానం చేసిందని భాను తన పిటిషన్లో పేర్కొన్నారు.

టీటీడీ నిధులు దారి మళ్లించేందుకు ప్రయత్నాలు

బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన టీటీడీ నిధులు దాదాపు ఐదు వేల కోట్లు డిసెంబర్‌ నెలలో కాలపరిమితి తీరనున్నాయని… వాటని దారిని మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భానుప్రకాశ్ ఆరోపించారు. టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌, కార్యనిర్వాహణాధికారిని ప్రతివాదులుగా చేర్చాలని వ్యాజ్యంలో కోరారు.