అప్పులు చేసి ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలి : బూర నర్సయ్య గౌడ్

అప్పులు చేసి ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలి  : బూర నర్సయ్య గౌడ్

బీఆర్ఎస్ ప్రభుత్వంపై  మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్  ఫైరయ్యారు. కాళేశ్వరం పేరుతో తప్పుడు లెక్కలు చూపించి నిధులను వెనకేసుకున్నారని ఆరోపించారు. దేశంలోనే అత్యంత అవినీతిమయమైన ప్రాజెక్ట్ కాళేశ్వరమని అన్నారు. అసలు కాళేశ్వరం డ్యామా? చెక్ డ్యామా? దీనిపై చర్చకు కేటీఆర్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కాళేశ్వరం ద్వారా 30వేల ఎకరాలకు నీరు పారితే.. బ్యాక్ వాటర్ ద్వారా 40వేల ఎకరాలు మునిగిపోతాయని ఆరోపించారు. కాళేశ్వరం ద్వారా కొట్టేసిన డబ్బులను మహారాష్ట్ర, ఢిల్లీలో వాడుతున్నారని బూర ఆరోపణలు గుప్పి్ంచారు. 

హైదరాబాద్‭ను కరప్షన్ సెంటర్‭గా మార్చి.. రాష్ట్రాన్ని 5లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని బూర నర్సయ్య విమర్శించారు. ఆరేళ్లలో ఆరింతల అప్పు చేసే అంత అవసరం ఏమొచ్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన  నిలదీశారు. అప్పు చేసిన నిధులతో రాష్ట్రంలో ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు గుజరాత్ తో, తెలంగాణకు పోలికేంటన్నారు. గుజరాత్ లో మద్యపాన నిషేధం అమలులో ఉంది మరి దీన్ని ఇక్కడ అమలు చేసే దమ్ముందా అని ప్రశ్నించారు.