ఎమ్మెల్యే కేపీ వివేకానందకు బీజేపీ నేత కౌంటర్

ఎమ్మెల్యే కేపీ వివేకానందకు బీజేపీ నేత కౌంటర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీ వివేకానందకు గడ్డుకాలం ఏర్పడిందని మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి అన్నారు. మంత్రి మల్లారెడ్డిపై ఐటీ రైడ్స్ జరుగుతున్న నేపథ్యంలో.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పన్నల హరీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సైతం ఆయన వెంట తిరిగేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇలా మీడియా ముందుకు వచ్చి అసభ్య పదజాలంతో తిడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రజలు సైతం ఆయనపై అసహనం వ్యక్తం చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో వివేకానందకు టిక్కెట్ రాదనే భయంతోనే ఇలా మాట్లాడుతున్నాడని తెలిపారు. బూతులు మాట్లాడడం ద్వారా ఓట్లు, టిక్కెట్లు రావని ఎమ్మెల్యే గ్రహించాలని హరీష్ రెడ్డి సూచించారు.