‘కేసీఆర్.. పాకిస్థాన్ తో మాట్లాడు. వాళ్లని కూడా కలుపుకుందాం’

‘కేసీఆర్.. పాకిస్థాన్ తో మాట్లాడు. వాళ్లని కూడా కలుపుకుందాం’

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రజలకు అబద్ధాలు చెప్పి, వారిని తప్పు దారి పట్టించారని, అసెంబ్లీని  దుర్వినియోగం చేశారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బుధవారం గవర్నర్ తమిళ సై ని కలిసిన లక్ష్మణ్..  ఆ తర్వాత రాజ్ భవన్ ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ తో క్షమాపణ చెప్పించాలని గవర్నర్ ను కలిసి కోరామన్నారు.

కేంద్ర ప్రభుత్వం NRC పై ఇంకా నిర్ణయమే తీసుకోలేదని, CAA భారత ప్రజలకు వ్యతిరేకం కాదని చెప్పారు. CAA వ్యతిరేక తీర్మానం చెల్లదని తెలిసే..  సీఎం కేసీఆర్ మజ్లీస్ కోసం తీర్మానం చేశారని లక్ష్మణ్ అన్నారు.

“పాకిస్తాన్ ముస్లింలకు కూడా భారత దేశంలో పౌరసత్వం ఇవ్వాలని సీఎం అనుకుంటున్నారేమో..  అలా అయితే పాకిస్థాన్ ను కూడా కలుపుకుందాం. KCR.. అఖండ భారత్ కోసం పాకిస్తాన్ తో మాట్లాడమని” లక్ష్మణ్  అన్నారు.