
ప్రధాని మోడీకి సరితూగే వ్యక్తి దేశంలోనే లేరన్నారు బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షడు లక్ష్మణ్ అన్నారు. అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసిన నాయకుడు మోదీ అని కొనియాడారు. లాల్ చౌక్ లో రాహుల్, ప్రియాంక స్వేచ్ఛగా తిరిగేలా చేశారని చెప్పారు. తూటాలతో ఉండే కాశ్మీర్ నేడు లక్షలాది మంది పర్యాటకులతో సందడిగా మారిందంటే దానికి మోదీ కారణమన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపడానికి మోడీ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారని చెప్పారు.
బీఆర్ఎస్ వ్యతిరేకతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు లక్ష్మణ్. గ్యారెంటీలు,ఉచితాల పేరు మీద మనం కట్టిన పన్నుల డబ్బులను వృధా చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలులో జరిగిన అవినీతి పై రేవంత్ సర్కార్ ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.