ఎన్నికల మీదున్న సోయి ప్రజారోగ్యంపై లేదు

ఎన్నికల మీదున్న సోయి ప్రజారోగ్యంపై లేదు

ప్రభుత్వానికి ఎన్నికల మీదున్న సోయి ప్రజారోగ్యం మీద లేదన్నారు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చ అధ్యక్షుడు లక్ష్మణ్. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. మొండిగా ఎన్నికలకు వెళ్తే తాము కూడా పోటీ చేస్తామన్నారు. బీజేపీకి  ఎన్నికల కంటే  కరోనా నియంత్రణే ముఖ్యమన్నారు. ఈ ఎన్నికలు తమకు ప్రతిష్టాత్మకం కాదన్నారు.  100 మంది  టెస్టింగ్ వెళితే 40 మందికి పాజిటివ్ వస్తుందన్నారు. ప్రభుత్వానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద లేదన్నారు. భేషాజాలకు వెళ్లకుండా రాష్ట్ర ప్రజల క్షేమం దృష్ట్యా  మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా వేయాలన్నారు. వెంటిలెటర్ల వద్ద వెయిటింగ్ లిస్ట్ ఏంటన్నారు. టీమ్స్ లో డాక్టర్, వైద్య సిబ్బంది కొరత ఉందన్నారు. మంత్రి ఈటెల రాజేందర్ నిస్సాహాయులన్నారు. బెడ్స్ కొరత పేరిట కార్పొరేట్ హాస్పిటల్స్  ప్రజలను దోచుకుంటున్నాయన్నారు. కరోనాను  ఆరోగ్య శ్రీ లో చేర్చాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై గవర్నర్ తమిళిసై కి లేఖ రాశామన్నారు.  రాష్ట్రం  ఆయుష్మాన్ భారత్ ను అడప్ట్ చేసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలన్నారు.