
సీఎం కేసీఆర్.. రైతుల సమస్యలు పరిష్కరించకుండా కేంద్రసర్కార్ పై నిరసనలకు దిగుతామనడం దారుణమన్నారు బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల చూసి తట్టుకోలేకపోతున్నారన్నారు. బీజేపీ కార్యకర్తల్ని తరిమికొట్టాని సీఎం పిలుపునివ్వడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. ఢిల్లీలో కాంగ్రెస్- టిఆర్ఎస్ కలిసి చేస్తున్న రాజకీయాల్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు సుధాకర్ రెడ్డి.