
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండలో రావు పద్మ అధ్యక్షతన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా బీజేపీ జెండాను రావు పద్మ ఆవిష్కరించారు. తెలంగాణలో అవినీతిమయ పాలన కొనసాగుతోందని ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నేతలు, కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నామన్నారు. ప్రధాని మోడీపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రేమేందర్ రెడ్డి మండిపడ్డారు.