
గచ్చిబౌలి, వెలుగు: సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ సెక్రటేరియెట్ ముట్టడికి పిలుపునివ్వగా అందులో పాల్గొనేందుకు శేరిలింగంపల్లి నుంచి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ వచ్చారు. శుక్రవారం పలువురు నాయకులతో కలిసి ఆయన సెక్రటేరియెట్ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.