కోహెడ, వెలుగు: వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని బీజేపీ ఖమ్మం జిల్లా కౌన్సిల్ మెంబర్ వెంకటేశం ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో నష్టపోయిన పంటలను బీజేపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నీళ్లపాలు కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రమేశ్, నాయకులు రాజిరెడ్డి, సుమన్, శ్రీకాంత్‌రెడ్డి, అరుణ్‌కుమార్, చిరంజీవి ఉన్నారు.
