బీజేపీ ఇంచార్జ్‌లతో సమావేశమైన వివేక్ వెంకటస్వామి

బీజేపీ ఇంచార్జ్‌లతో సమావేశమైన వివేక్ వెంకటస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన శక్తి కేంద్ర సమావేశంలో ఆ పార్టీ జాతీయకార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బీజేపీ బూత్ ఇంచార్జ్ లతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. వారందరికీ ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పలు ప్రణాళికలు చేస్తోంది. బైపోల్ షెడ్యూల్ రాకముందే ప్రచారం మొదలుపెట్టిన ఆయా పార్టీలు.. మరోవైపు జనం నాడిని పసిగట్టేందుకు వివిధ సంస్థలతో సర్వేలు చేయిస్తున్నాయి. అందులో భాగంగా పార్టీ పరిస్థితులు, అభ్యర్థి బలాబలాలు లాంటి వాటిపై పలు పార్టీలు ఇప్పటికే ఫోకస్ చేశాయి. ఎన్నికల్లో గెలిచేందుకు పలు పార్టీ లీడర్లు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా ప్రజలతో మమేకమవుతున్నారు.