హరీష్ రావు పర్యటన .. బీజేపీ నేతల అరెస్ట్

హరీష్ రావు  పర్యటన .. బీజేపీ నేతల అరెస్ట్

మంత్రి హరీష్ రావు మంచిర్యాల జిల్లా పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అంతకుముందు ఆయన పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ జిల్లా నేతలు పిలుపునిచ్చారు. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పైపులైను మరమ్మత్తులను వెంటనే చేపట్టి శాశ్వత పరిష్కారం చూపించాలని జిల్లా అధ్యక్షులు రఘునాథ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ ద్వారా ఏటా నష్టపోతున్న చెన్నూరు కోటపల్లి మండలాల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. 

గతేడాది వరదల వల్ల మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ముంపు ప్రాంతాల ప్రజలకు ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి హరీష్ రావు..  రైతులకు, ప్రజలకు భరోసా కల్పించకపోతే ఆయన పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ నేతలు చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. చెన్నూర్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని, స్టేషన్ కు తరలించారు.