మోదీ ప్రమాణ స్వీకారంపై సంబరాలు

మోదీ ప్రమాణ స్వీకారంపై సంబరాలు

నిజామాబాద్​, వెలుగు: ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం పట్ల నగరంలో బీజేపీ లీడర్లు సంబరాలు చేసుకున్నారు. పులాంగ్​ చౌరస్తాలో  టపాసులు కాల్చి స్వీట్స్​ తిన్నారు.  మంత్రులుగా అవకాశం లభించిన కిషన్​రెడ్డి, బండి సంజయ్​కు అనుకూలంగా నినాదాలు చేశారు.  బీజేపీ జిల్లా పార్టీ జనరల్​ సెక్రెటరీ న్యాలం రాజు, శంకర్​, నారాయణ యాదవ్​, బద్దం కిషన్​ తదితరులు ఉన్నారు.

కామారెడ్డిలో..

కామారెడ్డిటౌన్​ ​, వెలుగు : కామారెడ్డిలో ఆదివారం రాత్రి బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. నరేంద్రమోదీ 3వ సారి ప్రధానమంత్రి గా  ప్రమాణ స్వీకారం చేయటంతో పాటు , కిషన్​రెడ్డి, బండి సంజయ్​లు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం  పట్ల సంబరాలు నిర్వహించారు. పటాకులు  కాల్చారు.  టౌన్​ ప్రెసిడెంట్​  ఆకుల భరత్​,  మున్సిపల్ ఫ్లోర్​ లీడర్​ శ్రీకాంత్​, కౌన్సిలర్లుపాల్గొన్నారు.