అక్రమ వలసదారులను తరిమేయాలి : బీజేపీ నాయకులు

అక్రమ వలసదారులను తరిమేయాలి : బీజేపీ నాయకులు

కుంటాల, భైంసా, జన్నారం, సారంగాపూర్, లక్ష్మణచాంద వెలుగు : పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ లోకి చొరబడినవారిని గుర్తించి వెంటనే తరిమేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఆయా కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు.

 ఏప్రిల్  22న కశ్మీర్​లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరుల ప్రాణాలు బలిగొన్న ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. దేశంలో అక్రమంగా చొరబడిన రోహింగ్యాలు ఇక్కడ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిని గుర్తించి ప్రభుత్వాలు వెళ్లగొట్టాలని కోరారు.