ఖాదీ బోర్డు భూముల వెనుక ఎమ్మెల్యే హస్తం

ఖాదీ బోర్డు భూముల వెనుక ఎమ్మెల్యే హస్తం

జగిత్యాల జిల్లా మెట్పల్లి, పూడూర్ ఖాదీ బోర్డు భూముల వ్యవహరంపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని మెట్పల్లి బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మెట్పల్లిలో ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, నియోజకవర్గ కన్వీనర్ చెట్లపెళ్లి సుఖేందర్ గౌడ్ మాట్లాడారు. మెట్పల్లి ఖాదీ బోర్డుకు చెందిన పూడూరు, నిజామాబాద్ జిల్లా కిషన్ నగర్ లోని భూములను కోట్లాది రూపాయలకు అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపించారు. ఖాదీ బోర్డు భూములను చేనేత కార్మికులకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.

భూముల అమ్మకాల వెనుక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఉన్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అయినా ఎమ్మెల్యే స్పందించకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. ఎమ్మెల్యే చేనేత కార్మికులకు సమాధానం చెప్పకపోవడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు. మెట్పల్లి ఖాదీ బోర్డుకు చెందిన దాదాపు 200 షెటర్లు ఉన్న కాంప్లెక్స్ నిర్మాణం మున్సిపల్ అనుమతి లేకుండా చేపట్టారని అన్నారు. ఖాదీ బోర్డుకు ఎమ్మెల్యే చైర్మన్ గా ఉండటంతో మున్సిపల్ అధికారులు ఆయనకు తొత్తుగా మారి అవినీతి అక్రమాలకు సహాయపడుతున్నారని మండిపడ్డారు. పేదోడు 100 గజాల ఇల్లు కట్టుకుంటే వేలాది రూపాయలు వసూలు చేసే అధికారులు.. ఖాదీ బోర్డుకు చెందిన దాదాపు 200 షెటర్లు అక్రమంగా నిర్మాణం జరిగితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ నేతలు నిలదీశారు.