అమెరికా వర్సిటీలో కాల్పులు..ఇద్దరు మృతి... మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

అమెరికా వర్సిటీలో కాల్పులు..ఇద్దరు మృతి... మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

ప్రావిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రోడ్ ఐలాండ్ రాష్ట్ర రాజధాని ప్రావిడెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బ్రౌన్ యూనివర్సిటీలో శనివారం మధ్యాహ్నం ఓ దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. శనివారం వర్సిటీలోని ఇంజనీరింగ్ బిల్డింగ్​లో గల ఐవీ లీగ్​క్యాంపస్​లో ఫైనల్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ప్రావిడెన్స్ మేయర్ బ్రెట్ స్మైలీ తెలిపారు. 

నిందితుడు నల్లటి దుస్తులు ధరించిన ఉన్నాడని, అతడు కాల్పులు జరిపి బిల్డింగ్​నుంచి బయటకు వెళ్లినట్టు కనిపించిందని పోలీసులు తెలిపారు. కాగా, విద్యార్థులు తమ గదుల​లోపలే ఉండాలని, అధికారులు ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ప్రకటించే వరకు బయటకు రావొద్దని సూచించారు. 

ఈ ఘటనపై శనివారం సాయంత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.