కల్చర్‌‌ సెంటర్స్ లా మారుతున్న రెస్టారెంట్లు!

కల్చర్‌‌ సెంటర్స్ లా మారుతున్న రెస్టారెంట్లు!

రుచికరమైన ఫుడ్ అందించాలనే ఉద్దేశంతోనే ఏ రెస్టారెంట్​ అయినా మొదలవుతుంది. కస్టమర్స్​ కూడా మంచి ఫుడ్​, బ్యూటిఫుల్ యాంబియెన్స్ ఎక్స్​పీరియెన్స్ చేయాలని రెస్టారెంట్లకు వెళ్తుంటారు. కస్టమర్స్​ని అట్రాక్ట్ చేసేపనిలో భాగంగా రకరకాల థీమ్స్​తో రెస్టారెంట్​లు నడుపుతున్నారు చాలామంది. అయితే ఇంకాస్త ముందుకెళ్లి వెరైటీగా ఆలోచిస్తున్నాయి మన ఇండియన్ రెస్టారెంట్​లు.

 ఇక్కడ కేవలం తినడం మాత్రమే కాదు.. మరెన్నో యాక్టివిటీలు చేస్తూ ఎంజాయ్​ చేసే విధంగా మారబోతున్నాయి. ఒక్కసారి రెస్టారెంట్​లోకి అడుగుపెడితే కూర్చుని సినిమా చూసే దగ్గర నుంచి బోర్డ్ గేమ్స్, పాటరీ, పెయింటింగ్​.. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ థింగ్స్​ని ఎంజాయ్ చేయొచ్చు. 

ఇండియాలో అనేక అవుట్ లెట్​లు ఉన్న అతిపెద్ద బార్ చెయిన్ ‘సోషల్’. బెంగళూరులోని ఒక బ్రాంచ్​లో మొట్టమొదటిసారి ‘బ్యాట్స్ అండ్ బూజ్’ పేరుతో లెక్చర్​ సెషన్‌ నిర్వహించారు. ఈ సెషన్​ బ్యాట్ రీసెర్చర్​ అయిన డాక్టర్ రోహిత్​ చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగింది.

 ఇందుకోసం టికెట్స్​ చాలా ఫాస్ట్​గా అమ్ముడయ్యాయి. పింట్​ ఆఫ్​ వ్యూ గ్రూప్ ఈ ఈవెంట్​ని చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా లెక్చర్స్ ఇవ్వడానికి రెడీ అవుతోంది ఆ టీమ్. ఢిల్లీలోనూ సాకెట్ సోషల్​లో ‘హౌ ఐ మెట్ యువర్ మ్యాటర్’ టైటిల్​​తో మెటీరియల్ సైంటిస్ట్, మెకానికల్ ఇంజనీర్​ అయిన డాక్టర్ రమ్య అహుజా లెక్చర్​ ఇచ్చింది. ఇందులో కాఫీ మగ్స్ నుంచి కాక్​టెయిల్​ గ్లాస్​లు, బట్టలు ప్యాక్​ చేయడం వరకు ఎన్నో విషయాల గురించి మాట్లాడారు.


రెస్టారెంట్స్​ విజిటర్స్​కి క్రియేటివ్ ఎక్స్​పీరియెన్స్ ఇవ్వాలనే ఆలోచనతో ఇలాంటి కాన్సెప్ట్స్ ముందుకు వస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్​లు పెయింటింగ్, మగ్ పెయింటింగ్, క్లే మోడలింగ్ వంటి యాక్టివిటీస్ చేసేలా వీలు కల్పిస్తున్నాయి. ఇలాంటి చోట్లకు వెళ్లినప్పుడు ఆ రోజు మెమొరబుల్ అవుతుందని, కాసేపు డిజిటల్ వరల్డ్​కి దూరంగా ఉండొచ్చని అనుకుంటున్నారు.

►ALSO READ | సినిమాల్లో బహుజనుల స్థానమేంటి?

 ఇంకా కొన్ని రెస్టారెంట్​లు అయితే విజిటర్స్​కు కుకింగ్ క్లాసులు కూడా చెప్తున్నాయి. లియోస్ పిజ్జేరియా సండే పిజ్జా మేకింగ్ మాస్టర్​క్లాసెస్​ను ఆఫర్ చేస్తోంది. సుషీ రోల్ ఎలా చేయాలి? వంటివి నేర్పిస్తున్నారు. గురుగ్రామ్​లోని ఓ రెస్టారెంట్​లో పాస్తా చేయడమెలాగో నేర్పిస్తున్నారు. 
ప్రజలు కేవలం ఫుడ్​ ఎంజాయ్ చేయడానికి మాత్రమే రెస్టారెంట్​కి రావట్లేదు. 

వాళ్లకు ఒక డిస్కవరీ, ఎమోషన్​ కావాలి. అది ఫుడ్​ నుంచి మాత్రమే దొరకదు. అందుకే నైట్​ టైంలో కూడా పెయింట్ చేయడం, సుషీ మేకింగ్ వంటి క్రియేటివ్​ వర్క్​షాప్స్​ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

వీటిలో పార్టిసిపేట్ చేసి కొత్త అనుభవాలను, కొన్ని మధురమైన క్షణాలను క్రియేట్ చేసుకుంటున్నారు. ఒక పదేళ్ల కిందట లైవ్ మ్యూజిక్ ఉండేది. బార్స్​, క్లబ్స్​లో డాన్స్ కూడా ఉండేది. కానీ, ఇప్పుడు డైనింగ్ అంటే యాక్టివిటీ ప్లేస్ కూడా. ఇంకా చెప్పాలంటే కల్చరల్ సెంటర్స్​గా మారుతున్నాయి. 

గతంలో ఒక్క టీ షాప్​కి వెళ్తే కొత్త పరిచయాలు, తెలియని వాళ్లతో రకరకాల అంశాల పై చర్చలు సరదాగా జరిగేవి. ఇప్పుడు అలాగే ఈ యాక్టివిటీస్ ద్వారా సోషల్ కమ్యూనికేషన్ పెరుగుతుంది. పైగా రెస్టారెంట్​లకు తరచూ వెళ్లేవాళ్లకంటే బర్త్​ డే, యానివర్సరీ వంటి స్పెషల్ డేస్​ని మెమొరబుల్​గా చేసుకోవడానికి వెళ్లే వాళ్లే ఎక్కువ. అలాంటివాళ్లకు ఇలాంటి రెస్టారెంట్లు అద్భుతమైన అనుభూతినిస్తాయనడంలో సందేహం లేదు.