యెడ్యూరప్ప ఇంటికి క్యూ కట్టిన బీజేపీ నేతలు

యెడ్యూరప్ప ఇంటికి క్యూ కట్టిన బీజేపీ నేతలు

బెంగళూరులో యెడ్యూరప్ప ఇంటికి బీజేపీ నేతలు క్యూ కట్టారు. ఉదయం 8గంటల నుంచి యెడ్యూరప్ప ఇంట్లో బీజేపీ నేతలు చర్చలు సాగిస్తున్నారు. మురుగేష్ నిరానీ, ఉమేష్ కట్టీ, ముధుస్వామి, రత్నప్రభలు ఉదయం నుంచి యెడ్డీ ఇంట్లోనే ఉన్నారు. తర్వాత మరికొందరు నేతలు వచ్చి చర్చల్లో పాల్గొన్నారు. కుమారస్వామి ప్రభుత్వం కూలితే… ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాన చర్చ జరుగుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్-JDS ఎమ్మెల్యేల కంటే తమకు ఎక్కువ బలం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తమకు దాదాపు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని… కాంగ్రెస్-JDS బలం 103కు పడిపోయిందంటున్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయం తీసుకుని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే చచ్చిపోయిందని… తమకు సంఖ్యాబలం ఉన్నందున ఖాళీగా కూర్చోలేమని చెబుతున్నారు బీజేపీ నేతలు.