ఓట్ల కోసమే కేసీఆర్ యాదాద్రి పర్యటన

ఓట్ల కోసమే కేసీఆర్ యాదాద్రి పర్యటన

హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్నారు బీజేపీ నేతలు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారన్నారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ని కలిశారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా మాట్లాడారు బీజేపీ నేత ఎన్వీఎస్ ప్రభాకర్. అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగనికి పాల్పడుతుందని ఫిర్యాదు ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను అధికార పార్టీ నేతలు ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. ఒక వర్గానికి చెందిన ఓట్లను రాబట్టేందుకే కేసీఆర్ యాదాద్రి పర్యటన చేశారన్నారు.

నిరంజన్ రెడ్డి ఓ సమావేశంలో టీచర్లను భయబ్రాంతులకు గురి చేశాడన్నారు. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇంకా మూడు సంవత్సరాలు మేముంటామంటూ బెదిరింపులకు గురి చేశారన్నారు. టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పారు. మంత్రుల కామెంట్స్, సీఎం కేసీఆర్ యాదద్రి పర్యటనపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు బీజీపీ నేతలు.