ఓ పక్క షూటింగ్.. మరో పక్క క్లాసులు

ఓ పక్క షూటింగ్.. మరో పక్క క్లాసులు

హైదరాబాద్ సరూర్ నగర్ VM హోంలో జరుగుతున్న హీరో రామ్ చరణ్ సినిమా షూటింగ్ ను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. విద్యార్థులకు క్లాసులు జరుగుతుండగా షూటింగ్ లకు ఎలా అనుమతిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్ జరుగుతోందని బీజేపీ నేతలకు సమాచారం అందింది. వెంటనే బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి, ఇతర నేతలు అక్కడకు వెళ్లారు. షూటింగ్ జరుగకుండా అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబిత, టీఆర్ఎస్ నేతలు తమ స్వలాభం కోసం షూటింగ్ కు అనుమతిచ్చారని కార్పొరేటర్ ఆరోపించారు.

పాతగా ఉందని..దీనికి కలర్ వేసేందుకు హడావుడిగా రూ. 4 కోట్లు కేటాయించి.. పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. స్కూల్ కు కాంపౌండ్ వాల్ కోసం నిధులు మాత్రం విడుదల చేయడం లేదని విమర్శించారు. కాంపౌండ్ వాల్ లేకపోవడంతో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వివరించారు. ఒక విద్యాలయం ఉంది..ఇక్కడ విద్యార్థులు చదువుకుంటారనే విషయం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. అనాథ పిల్లల పేరిట జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.