ఎంసీడీ ఎన్నికల కౌంటింగ్ : బీజేపీ – ఆప్ మధ్య టఫ్ ఫైట్

ఎంసీడీ ఎన్నికల కౌంటింగ్ : బీజేపీ – ఆప్ మధ్య టఫ్ ఫైట్

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.106 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా..59స్థానాల్లో ఆప్, కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.  మొత్తం 250 వార్డులకు గాను 1349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 4న జరిగిన పోలింగ్ లో దాదాపు 51 శాతం ఓటింగ్ నమోదు అయింది. 40 సెంటర్లలో పటిష్ట బందోబస్తు.. ఎన్నికల అబ్జర్వర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది. 20 కంపెనీల కేంద్ర బలగాలు, 20వేల మంది లోకల్ పోలీసులు.. 68మంది అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఓట్లు లెక్కిస్తున్నారు. అన్ని పార్టీలు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను సవాల్ గా తీసుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ అగ్రనేతలంతా ఢిల్లీ గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేశారు. దీంతో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది.


 
మూడు బాడీలుగా ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఒకే గొడుగు కిందకు తెచ్చింది కేంద్రం ప్రభుత్వం. ఈ ఏడాది మేలో బిల్లు పెట్టి.. ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్, సౌత్ ఢిల్లీ కార్పోరేషన్లను రద్దు చేసి.. మూడింటిని కలిపి ఒకే మున్సిపల్ కార్పోరేషన్ గా ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీగా ఏర్పాటు చేసి.. వార్డులను 250స్థానాలకు కుదించారు. మధ్యాహ్నం వరకు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ట్రెండ్స్ మాత్రం ఆప్, బీజేపీ పోటాపోటీగా కొనసాగుతున్నాయి.