
జమిలి ఎన్నికల్ని అమలు చేస్తాం
ఈసారి అధికారంలోకి వస్తే, దేశంలో పార్లమెంట్ , అసెంబ్లీ లకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని బీజేపీ హామీ ఇచ్చింది. అవినీతిని నిరోధించడంతో పాటు సివిల్ సర్సీసెస్ , గవర్నెన్స్‌లో సంస్కరణలు
ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దు
ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి మేనిఫెస్టో లో13అంశాలను పేర్కొన్న బీజేపీ, ‘నేషన్ ఫస్ట్’ నినాదానికిఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిం ది. ఐదేం డ్ల మోడీ పాలనలోజాతీయ భద్రతకు సంబంధించి ప్రాథమికఆలోచనలు సమూలంగా మారిపోయాయని, ఆమార్పునే ఇకముం దూ కొనసాగిస్తా మన్నారు.అందులో భాగంగా జమ్మూకాశ్మీ ర్ రాష్ట్రా నికి ప్రత్యేకప్రతిప్రత్తిని కల్పిం చే ఆర్టికల్ 370ని , ఆ ప్రాంతంలోస్థానికేతరులు శాశ్వత నివాసం ఏర్పర్చుకోడానికిఅడ్డం కిగా ఉన్న ఆర్టికల్ 35ఏ ని కూడా రద్దు చేస్తామనిబీజేపీ హామీ ఇచ్చిం ది. దీం తోపాటు ఈశాన్యరాష్ట్రా ల్లోముస్లిమేతర మతస్థులకు భారత పౌరసత్వం కల్పిం చేసిటిజన్ షిప్ సవరణ బిల్లును ఎట్టిపరిస్ థితుల్లోకొనసాగిస్తా మని చెప్పిం ది. భద్రతా బలగాల సంక్షేమంకోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని, కోస్టల్సేఫ్టీతోపాటు బోర్డర్ లో భద్రతను మరింత పటిష్టంచేస్తామని, పోలీసు వ్యవస్థను ఆధునీకరిస్తా మనితెలిపింది. టెర్రరిజంపై ఉక్కు పాదం ( జీరో పర్సెంట్టోలరెన్స్) మోపుతామని, అదేసమయంలో వామపక్షతీవ్రవాదాన్నీ సమూలంగా పెకిలిస్తామని పేర్కొంది.
అయోధ్యలో మందిరం.. ఉమ్మడి కోడ్
రామజన్మభూమిలో ఆలయం కట్టితీరాలన్న వాగ్ధా నానికి కట్టు బడిఉన్నాం . రాజ్యాంగ పరిధికి లోబడి నిర్మాణాన్ని చేపట్టేం దుకుగల అవకాశాలన్నింటినీ పరిశీలిస్తాం. భారతీయ సంస్కృతి, విశ్వాసాలు, భాషల్ని పరిరక్షిస్తాం . శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించరాదన్న విశ్వాసాన్ని సమర్థిస్తున్నాం . ఈవిషయమై సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తాం . విశ్వాసం, నమ్మకాలకు సంబంధించి న అంశాల్లో రాజ్యాంగ రక్షణ పొందేందుకు కృషి చేస్తాం .
మతాలతో నిమిత్తం లేకుండా దేశంలోని పౌరులందరినీ ఒకే చట్రంలోకి తీసుకొచ్చేలా ఆర్టికల్ 44ను సవరించి , యూనిఫాం సివిల్ కోడ్(ఉమ్మడిపౌరస్మృతి)ను తీసుకొస్తాం.
‘‘జాతీయవాదమే మా ప్రేరణ.. అంత్యోదయమే మా దర్శనం.. సుపరిపాలనే మా మంత్రం”అనిభారతీయ జనతా పార్టీ(బీజేపీ) స్పష్టం చేసింది. గడిచిన ఐదేండ్ల పరిపాలనే పునాదిగా, రాబోయే ఐదేండ్లకు సంబంధించి రిజల్యూషన్స్ రూపొందించింది.‘సంకల్ప పత్రం’ పేరుతో 2019 లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి(అటానమీ) కల్పించే ఆర్టికల్370ని రద్దు చేస్తామని, అన్నిమతాల వారికి ఒకే చట్టంవర్తించేలా యూనిఫాం సివిల్ కోడ్ ను అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అయోధ్యలో రామమందిరం కట్టితీరుతానని, ఈశాన్య రాష్ట్రాల్లో సిటి జన్షిప్ చట్టాన్ని కొనసాగిస్తానని ఉద్ఘాటించింది. సరిహద్దు, అంతర్గత భద్రతకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానన్న కమలదళం, ఆతర్వాతే రైతు సంక్షేమం, మౌలిక సదుపాయల కల్పన,సాంస్కృతి క వారసత్వ పరిరక్షణ తదితర 13అంశాల పై పలు వాగ్ధానాలు చేసింది.
2022లో ఇండియా 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో చేరాల్సిన ‘75 మైలురాళ్లు’ పేరుతో మేనిఫెస్టోలో ప్రత్యేక అంశాలను పొందుపర్చింది. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్ లో ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ చీఫ్ అమిత్ షా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్నాథ్ సింగ్ ‘బీజేపీ సంకల్ప పత్రం’ను విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్జైట్లీ, సుష్మాస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
46 పేజీలు.. 226 హామీలు
‘ సంకల్పిత్ భారత్ .. సశక్తి భారత్’ అనే శీర్షికతో సంకల్ప పత్రం(మేనిఫెస్టో)ను రూపొందించిన బీజేపీ, కవర్ పేజీపై పెద్ద సైజులో పీఎం మోడీ ఫొటో, పార్టీగుర్తుకు మాత్రమే స్థానం కల్పించింది. 46 పేజీలున్న మేనిఫెస్టోలో 13 అంశాలకు సంబంధించి మొత్తం 226 హామీలిచ్చింది. మేనిఫెస్టో మూడో పేజీలోనే‘130 కోట్ల కలలు’ పేరుతో మోడీ రాసిన సందేశాన్ని పొందుపర్చారు. ఆ తర్వాత అధ్యక్షుడు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్ నాథ్ ల నోట్స్ ను, పార్టీ సందేశాన్నిముద్రించారు. చివరి పేజీలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ ఉపాధ్యాయ, వాజ్ పేయిల ఫొటోలకు చోటు కల్పించారు. దాదాపు ప్రతి అధ్యాయం చివర్లోమోడీ ఫొటోతోపాటు కోట్స్ ను రాసుకొచ్చారు.
ఎక్కువ మందికి కిసాన్ యోజన
60 ఏండ్ల వయసు దాటి న చిన్న, సన్నకా రు రైతులకు పెన్షన్ సదుపాయం
ల్యాండ్ రికార్డుల డిజిటలైజేషన్ వడ్డీలేని కిసాన్ కార్డులు, నాణ్యతగల విత్తనాల సరఫరా
పీఎం కిసాన్ పథకం ద్వారా ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6వేలు పెట్టు బడి సాయాన్ని మరిన్ని కుటుం బాలకు విస్తరణ
ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన ద్వారా ఇప్పటికే 31 ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తి, మిగి లిన 68 ప్రాజెక్టుల్ని సకాలంలో నిర్మిస్తా మని హామీ
గ్రామీణ వ్యవసాయ రంగంలో రూ.25లక్షల కోట్ల పెట్టు బడులు, టెక్నాలజీ వినియోగానికి పెద్దపీట పంటల స్టో రేజీ సమస్యలకు పరిష్కా రంగా దేశవ్యాప్త వేర్ హౌజ్ నెట్ వర్క్ ఏర్పాటు.
24 గంటల కరెంట్ సరఫరా
2030 నాటి కి ప్రపంచంలో మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియాను తయారుచేయడం
జీఎస్టీని మరింత సులభతరం చేయడం, అదేసమయంలో పన్నుల రాబడిపైనా దృష్టి యోగాను గ్లోబల్ గా ప్రమోట్ చేస్తాం
మేకిన్ ఇండియా, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్టార్ట్అప్ ల వృద్ధికి సహకారం
గ్యాస్ , వాటర్ గ్రిడ్ల ఏర్పాటు, ఐవేస్, రీజనల్ ఎయిర్ పోర్టుల అభివృద్ధి
వచ్చే ఐదేం డ్లలో 60 వేల కిలోమీటర్ల నేషనల్హైవేల నిర్మాణం
2022 నాటి కి దేశమంతటా బ్రాడ్ గేజ్ లైన్ల విస్తరణ, అన్ని మార్గాల్లో విద్యుత్ లైన్ల ఏర్పాటు
రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, 2022 నాటికి అన్ని స్టేషన్లలో వైఫై సౌకర్యం
రైలు సౌకర్యం .
24 గంటల విద్యుత్ సరఫరాకు కృషి, సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి పెంపు
ఆయుష్మాన్ భవతో 10.7 కోట్ల మంది పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను మరింత మందికి విస్తరించడం
కొత్తగా టీబీ కేసులు బయటపడటంతో టీబీ ఎరాడికేషన్ లక్ష్యం 2025కు పొడిగింపు