పార్డి వై జంక్షన్ వద్దనున్న జిన్నింగ్ ఫ్యాక్టరీలో బీజేపీ సభ

పార్డి వై జంక్షన్ వద్దనున్న జిన్నింగ్ ఫ్యాక్టరీలో బీజేపీ సభ

నిర్మల్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా బీజేపీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. కోర్టు సూచనల మేరకు సభాస్థలి విషయంలో అర్థరాత్రి తర్వాత మార్పు చేసింది. పార్డి వై జంక్షన్ వద్ద ఉన్న ఓ జిన్నింగ్ ఫ్యాక్టరీలో సభ నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. భైంసాకు 3 కిలోమీటర్ల దూరంలో సభ నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు సభ జరగనుంది. సభ అనంతరం బండి సంజయ్ రెండో రోజు పాదయాత్ర ప్రారంభించనున్నారు.

నిజానికి భైంసాకు 4 కిలోమీటర్ల దూరంలోని సరస్వతి ఐటీ కాలేజీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నేతలు భావించారు. మొదట సభ నిర్వహించాలనుకున్న పార్డి వై జంక్షన్ వద్ద నుంచి వేదిక ఏర్పాటు సామాగ్రి, టెంట్లను సరస్వతి ఐటీ కాలేజీ ఎదురుగా ఉన్న స్థలానికి షిఫ్ట్ చేశారు. అయితే అర్థరాత్రి అనంతరం మళ్లీ నిర్ణయం మార్చుకున్న నేతలు సభా వేదికను పార్డి వై జంక్షన్ వద్ద ఉన్న ఓ జిన్నింగ్ ఫ్యాక్టరీలో సభ నిర్వహించాలని డిసైడయ్యారు.