
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఆకాశ్ విజయ్ వర్గియా అరెస్టయ్యాడు. అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న అధికారిని క్రికెట్ బ్యాట్ తో కొట్టిన ఎమ్మెల్యే ఆకాశ్ పై పోలీసులు కేసు పెట్టారు. అధికారిపై చేయి చేసుకున్న మరో పది మంది ఎమ్మెల్యే అనుచరులపైనా కేసులు నమోదయ్యాయి. దీంతో… ఎమ్మెల్యేతోపాటు.. 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. తర్వాత కోర్టులో హాజరుపరిచారు.
బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్ వర్గియా కొడుకు ఆకాశ్. అధికారిని బ్యాట్ తో కొట్టిన సంఘటన మధ్యప్రదేశ్ లో సంచలనం రేపింది.