యూట్యూబ్ చానెళ్లను కొనే ప్రయత్నం చేసిండు

యూట్యూబ్ చానెళ్లను కొనే ప్రయత్నం చేసిండు

పత్రికా స్వేచ్ఛ ప్రజల కోసమే కానీ రాజకీయ పార్టీల కోసం కాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమంటే ప్రజలపై చేయడమేనన్నారు. యూ ట్యూబ్ ఛానెళ్లను కొనే ప్రయత్నం చేశారు.. మాట వినని వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడే రాజ్యం హక్కుల మీద దాడి చేస్తుందన్నారు ఈటెల రాజేందర్. ప్రజలను ఎంత వేధించింది.. ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేసిందో అనే చర్చ హుజూరాబాద్ ఎన్నిక తర్వాత నుంచే ప్రారంభమైందన్నారు. ఏ ఉద్యమాలను, చైతన్యాన్ని పాతరేసే ప్రయత్నం చేశారో అవే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తున్నాయని తెలిపారు. సోషల్ మీడియా జర్నలిస్టులను అరెస్ట్ చేసింది SOT పోలీసులా లేక ప్రైవేట్ వ్యక్తులా అనేది డీజీపీ చెప్పాలన్నార ఈటెల రాజేందర్.