
నిర్మల్, వెలుగు: మహిళల సమగ్ర అభివృద్ధికి మహిళా సంఘాలు వేదికగా నిలుస్తున్నాయని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం నిర్మల్పట్టణంలోని పెన్షనర్స్భవనంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హత ఉన్న ప్రతీ మహిళ పొదుపు సంఘాల్లో చేరాలని, అధికారులు వారిని ప్రోత్సహించాలని సూచించారు. అడిషనల్కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ.. జిల్లాలో 12,043 మహిళా సంఘాలు ఉన్నాయని, వీటిలో 1,39, 361 మంది సభ్యులున్నారని తెలిపారు. 2025–-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 816 సంఘాలకు రూ.74.40 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరయ్యాయని చెప్పారు.
నియోజకవర్గంలోని 282 సంఘాలకు రూ.27.86 కోట్ల రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో 2 సోలార్ ప్లాంట్ల నిర్వహణకు రూ.3 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. అనంతరం 24 మంది లబ్ధిదారులకు రూ.16.97 లక్షల విలువైన ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందాలు మహిళా సాధికారతపై ప్రదర్శనలు ఇచ్చాయి. సెర్ప్ డైరెక్టర్ కృష్ణకుమార్, ఇన్‌చార్జి డీఆర్డీవో శ్రీనివాస్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంగమణి పాల్గొన్నారు.
మినీ ఇండోర్‌స్టేడియం నిర్మాణానికి కృషి
నిర్మల్ లో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తామని ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. పట్టణంలో శుక్రవారం రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని చెప్పారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీకాంత్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీశ్ రాథోడ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు, పీడీలు ఉన్నారు.
మహాలక్ష్మి అమ్మవారి సేవలో బీజేఎల్పీ నేత
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంలోని శివాజీ నగర్ కాలనీ మహాలక్ష్మి అమ్మవారిని శుక్రవారం బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. తిమ్మాపూర్ వీడీసీ ఆధ్వర్యంలో అమ్మవారి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి మొదటిసారి వచ్చిన మహేశ్వర్ రెడ్డిని స్థానిక బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రితీశ్‌రాథోడ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఆకుల శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, బీజేపీ మండల, పట్టణ అధ్యక్షులు ఉపేందర్, మనోజ్, నాయకులున్నారు.