టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను బొంద పెడ్తమంటున్నరు

టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను బొంద పెడ్తమంటున్నరు
  • రైతేడ్చిన రాజ్యం బాగు పడదు: ఈటల
  • హుజూరాబాద్ దెబ్బకు కేసీఆర్ బేజారు

నెట్ వర్క్, వెలుగు: ‘‘రైతేడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన ఎవుసం బాగుపడయి. తెలంగాణల ఇప్పుడు రైతులు ఏడుస్తున్నారు. అరిగోస పడ్తున్నరు” అని మాజీ మంత్రి, హుజూరాబాద్​ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.​ హుజూరాబాద్​బై ఎలక్షన్ల జనం తనను ఒడగొట్టిన్రనే సీఎం కేసీఆర్ వడ్లు కొంటలేడు. ఓడినంక అసహనం పెరిగింది. ప్రగతి భవన్, ఫాంహౌజ్​వదలనోడు తాను రద్దు చేసిన ధర్నా చౌక్​లనే ధర్నా చేసే స్థితికి దిగజారిండు. రెండు గంటలు ప్రెస్ మీట్​పెట్టి కూడా ఏం మాట్లాడుతుండో తెల్వని అయోమయంల పడ్డడు. ఆ కోపం, ఈ కోపం రైతుల మీద తీస్తున్నడు. అందుకే వడ్లు కొంటలేడు” అని ఆరోపించారు. ‘‘వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను భూస్థాపితం చేయాలని జనం ఉవ్విళ్లూరుతున్నరు. కేసీ‌‌‌‌‌‌‌‌ఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని చూస్తున్నరు. తమకు కూడా ఉప ఎన్నికలొస్తే బాగుండని కోరుకుంటున్నరు. బీజేపీని పోలీసు బలంతో అడ్డుకుంటున్న తీరును జనం గమనిస్తున్నరు. టైమొచ్చినప్పుడు కేసీఆర్ పాలనకు గోరీ కట్టేందుకు సిద్ధంగా ఉన్నరు” అన్నారు. ‘‘టీ‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే. రాబోయే ఎన్నికల్లో గెలుపు బీజేపీదే” అని ధీమా వెలిబుచ్చారు. ఆదివారం ఖమ్మం జిల్లా జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో ముదిరాజ్ వన సమారాధన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు దారి పొడవునా పలుచోట్ల, తర్వాత కొత్తగూడెంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ కోనేరు సత్యనారాయణ ఇంట్లో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. ‘‘ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసి రైతులు అవస్థలు పడుతున్నరు. సీఎం కేసీఆరేమో ధాన్యం కొనుగోళ్లపై పూటకోమాటతో రైతుల ఉసురు తీస్తున్నడు. వానాకాలం పంట కొంటమని కేంద్రం స్పష్టంగా చెప్పినా అబద్దపు మాటలతో కేంద్రంపైకి ఉసిగొల్పాలని చూస్తున్నడు. ప్రజాదర్బారుకు చరమగీతం పాడిన సీఎంగా ఘనత దక్కించుకున్నడు. పోలీసులను వాడుకుని దౌర్జన్య రాజకీయాలకు పాల్పడుతున్నడు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్ మెంట్​దొరకని దుస్థితి ఒక్క తెలంగాణలో తప్ప దేశంలో ఇంకెక్కడా లేదు. కాంగ్రెస్​ నుంచి గెలిచినోళ్లంతా టీఆర్ఎస్​ల చేరిన్రు. రాష్ట్రంలో టీఆర్ఎస్​కు గట్టి బుద్ధి చెప్పి, ఆదర్శ పాలన అందించేది బీజేపీ మాత్రమే” అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాషాయ జెండా ఎగరేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. కేసీఆర్​ అహంకారానికి హుజూరాబాద్​ప్రజలు మర్చిపోలేని గుణపాఠం చెప్పారన్నారు. ‘‘హుజూరాబాద్ ప్రజలను అంగడి సరుకులా డబ్బులతో కొందామని కేసీఆర్​అనుకున్నడు. ఆయన ఊహించని విధంగా వాళ్లు సంచలనాత్మక తీర్పు ఇచ్చిన్రు. కేసీఆర్ కుట్రలకు, అహంకారానికి చెంపదెబ్బ కొట్టిన్రు. నన్ను గెలిపించినోళ్లను, అందుకు కృషి చేసినోళ్లనూ ఎన్నటికి మరువలేను” అన్నారు.