
ప్రజల్లో తనకు మాత్రమే పలుకుబడి ఉందన్నట్టుగా మంత్రి హరీశ్ రావు అహంకారంతో వ్యహరిస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. అభివృద్ధి పేరుతో అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీష్ రావుకు హుజూరాబాద్ ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోనూ హరీష్ రావుకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. ప్రజలు అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేయడానికే గానీ, ప్రజల గొంతు నొక్కడానికి, దౌర్జన్యాలు చేయడానికి కాదని తెలుసుకోవాలని అన్నారు. సిద్దిపేటలోని రంగదాంపల్లి దగ్గర అమరుల స్థూపానికి నివాళులర్పించారు ఈటల. దళిత బందును రాష్ట్రామంతా అమలు చేయాలన్నారు ఈటల రాజేందర్. దీని కోసం సిద్దిపేటలో దళిత గర్జన పెట్టే రోజు వస్తదని, దానికి తానే నాయకత్వం వహిస్తానని ఆయన చెప్పారు.