- బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేశాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు ఆదివారం సెగ్మెంట్ లోని 52 కేంద్రాల్లో మహాపాదయాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు కర్రుకాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఓటర్లను సీఎం రేవంత్ రెడ్డి భయపెడుతున్నారని, కాంగ్రెస్ కు ఓటు వేయకుంటే పథకాలు రద్దు చేస్తామనడం సరికాదన్నారు.
